ఎట్టకేలకు ఐపిఎల్‌లో సిరాజ్‌కు అవకాశం

SARPAL11
SARPAL1

ఎట్టకేలకు ఐపిఎల్‌లో సిరాజ్‌కు అవకాశం

న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో అరంగేట్రం చేయాలన్న మహ్మద్‌ సిరాజ్‌ కోరిక ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో ఉప్పల్‌ వేదికగా జరిగినమ్యాచ్‌తో తీరింది.మ్యాచ్‌ అనంతరం మహ్మద్‌ సిరాజ్‌ మాట్లాడాడు.ఢిల్డీ డేర్‌ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌ తుది జట్టులో చోటు దక్కిందని తెలియగానే మాటల్లో చెప్పలేని అనుభూతికి లోనయ్యానన్నాడు.రాత్రికి ఢిల్లీతో మ్యాచ్‌ అనగానేఉదయాన్నే నాకు సమాచారం అందింది.దీంతో మానసికంగా ఐపిఎల్‌ అరంగేట్రం మ్యాచ్‌కి సిద్దమయ్యాను.తొలి మ్యాచ్‌కావడంతో కొంచెం ఒత్తిడికి కూడా గురయ్యాను.ఒత్తిడిని జయించినపుడే కదా విజేతగా నిలవగలం అని భావించాను.జట్టులోని సీనియర్లు ఆశిష్‌ నెహ్రా,భువనేశ్వర్‌్‌ కుమార్‌ నుంచి చాలా నేర్చుకున్నాను అని సిరాజ్‌ వివరించాడు.తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశానని,కొన్ని పరుగులిచ్చి తడబడ్డానని,రెండవ మ్యాచ్‌లో ఆ తప్పిదాలను సరిదిద్దుకుంటానని సిరాజ్‌ ధీమా వ్యక్తం చేశాడు.ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో నిర్వహించిన వేలంలో 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన మహ్మద్‌ సిరాజ్‌ను కొనుగోలు చేసేందుకు అన్ని ప్రాంచైజీలు పోటీ పడ్డాయి.చివరకు సన్‌ రైజర్స్‌హైదరాబాద్‌ 2.60 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.దేశవాళీ టోర్నీల్లో సిరాజ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు.అయితే సన్‌ రైజర్స్‌ తుది జట్టులో చోటు కోసం సిరాజ్‌ అయిదు ఐపిఎల మ్యాచ్‌లు ఎదురుచూడాల్సి వచ్చింది.