ఈడెన్‌ మ్యాచ్‌పై నెహ్రా కీల‌క వ్యాఖ్య‌లు

Ashish Nehra
Ashish Nehra

కోల్‌క‌త్తాః ఈడెన్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ కోరుకుని ఉంటే శ్రీలంకను 50-60 పరుగులకే ఆలౌట్‌ చేసేవాళ్లని నెహ్రా అన్నాడు. ఇటీవల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ ఫాస్ట్ బౌలర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదే పిచ్‌పై 200-220 పరుగులు చేస్తే మ్యాచ్‌ను కాపాడుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. భారత్ పిచ్‌లపై బంతి పెద్దగా స్వింగ్ కాదని, అలాంటి కొద్దిరోజులుగా వర్షం కురుస్తుండడంతో ఈడెన్ పిచ్‌పై తేమ ఉందని, దీని వల్ల పిచ్ సీమ్, స్వింగ్ బౌలర్లకు సహకరిస్తుందని నెహ్రా వివరించాడు. త్వరలో దక్షిణాఫ్రికాలో ఆడబోయే భారత జట్టుకు ఈ మ్యాచ్ ఎంతో ఉపకరిస్తుందని, ఈడెన్ పిచ్ దక్షిణాఫ్రికా పిచ్‌లను తలపిస్తోందని, భవిష్యత్‌లో దక్షిణాఫ్రికాలో ఎదురుకాబోయే పరీక్షే ఇప్పుడు భారత్‌కు ఈడెన్‌లో ఎదురవుతోందని నెహ్రా పేర్కొన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ పేస్‌ బౌలింగ్‌ విభాగాల్లో భారత జట్టు ఒకటన్నాడు. 2018 జనవరిలో భారత్.. దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా రెండు జట్ల మధ్య 3 టెస్టులు, 6 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.