ఇలాంటి స్వాగతం ఊహించలేదు

 

HARMNA PREET 1

ఇలాంటి స్వాగతం ఊహించలేదు

మోగా: మహిళల వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ ఫైనల్‌ చేరుకోవడంలో కీలకపాత్ర పోషించింది హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌. ఇంగ్లాండ్‌ పర్యటన ముగించుకుని స్వదేశం చేరుకున్న హర్మన్‌ ఆదివారం తన సొంతింటికి చేరుకుంది. పంజాబ్‌లోని మోగాలో ఆమెకి ఘనస్వాగతం లభించింది. మోగా శివారులో నివసించే హర్మన్‌ కుటుంబం ఆమె రాక కోసం ఎంతగానో ఎదురు చూసింది. హర్మన్‌ వచ్చిన అనంతరం సోదరుడు గుర్జీందర్‌ ఆమెను ప్రేమతో కౌగిలించుకున్నాడు. బ్రదర్‌ ఎలా ఉన్నావు అంటూ హర్మన్‌ అతన్ని ఆప్యాయంగా పలకరించింది. అనంతరం కుటుం బసభ్యులతో హర్మన్‌ సరదాగా గడిచింది. ఈసం దర్భంగా హర్మన్‌ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఈ తరహాలో నాకు ఘన స్వాగతం నాకు దక్కలేదు. నా సారథ్యంలో ఆసియా కప్‌ (టీ20 టోర్నమెంట్‌) గెలిచిన సమయంలో కూడా ఇంత స్పందన లేదు. నాకు అంతా కొత్తగా ఉంది.

అబి µమానులు బ్రహ్మరథం పడతారని నేను అసలు ఊహించలేదు. ఇప్పుడు చాలా గర్వంగా ఉంది. నా స్వంత గ్రామంలో జరిగిన ఈ ఘన స్వాగ తాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను అని చెప్పింది. విమానాశ్రయం నుంచి మోగా వచ్చే దారిలో పలువురు నన్నుగుర్తుపట్టారు. నా వాహనాన్ని ఆపి సెల్ఫీలు దిగాలని కోరారు. ఇప్పుడు నన్ను అందరూ గుర్తుపడుతున్నారు. మోగాలో ఉంటూ ఎన్నో టోర్నీలు ఆడాను. కానీ ఎన్నడూ ఇలా లేదు. ఇలాంటి అనుభూతి నా ఒక్కదానికే కాదు. ప్రపంచకప్‌ ఆడి వచ్చిన మహిళా క్రికెటర్లందరూ ఇలాంటి అనుభూతినే పొందుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నా దృష్టి అంతా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ పైనే. దీన్ని మేము గెలవాలి. ఇది మా కల అని హర్మన్‌ వివ రించారు. హర్మన్‌ను చూసేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో అభి మానులు తరలివచ్చారు. హర్మన్‌ రాకను పురస్కరించుకుని స్థానికులు, రాజకీయ నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా సెమీ ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆసీస్‌పై హర్మన్‌ 171 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అనంతరం ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ చేతిలో 9 పరు గుల తేడాతో భారత్‌ ఓటమి చవిచూసింది. ఫైన ల్లో ఓడిపోయినప్పటికీ మిథాలీసేన అద్భుత పోరాట ప్రదర్శన కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.