ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టాప్‌ బ్యాట్స్‌మెన్‌ వీరే

S4
Top Bats men

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టాప్‌ బ్యాట్స్‌మెన్‌ వీరే

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-0తో ఆధిక్యాన్ని సాధించింది.కాగా అటు బ్యాటింగ్‌తో సహ బౌలిం గ్‌లో కూడా కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సత్తా చాటుతుంది.ఇక ఈ సిరీస్‌లో టీమిండియా టెస్టు కెప్టెన్‌ కోహ్లీ బ్యాటింగ్‌లో దూసుకుపో తున్నాడు. కాగా ఈ సంవత్సరం మెరుగైన ఫామ్‌ లో ఉన్న కోహ్లీ ఈ సిరీస్‌లో ఇప్పటికే 405 పరు గులు సాధించాడు.కోహ్లీ ఫామ్‌ను అడ్డుకునేందుకు ఇంగ్లండ్‌ బౌలర్లు నానా తంటాలు పడుతున్నారు. కాగా రాజ్‌కోట్‌,విశాఖపట్నం టెస్టులో ఒక వైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ మాత్రం నిలకడగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.కాగా ఈ ఏడాది 10 టెస్టు మ్యాచ్‌లాడిన కోహ్లీ 68.92 యావరేజ్‌తో 965 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కోహ్లీ అనంతరం ఛటేశ్వరపుజరా అత్యధిక పరు గులు సాధించిన ఆటగాడిగా రెండవ స్థానంలో నిలి చాడు.ఇంగ్లండ్‌ఆటగాడు జోరూట్‌ మూడవ స్థానం లోఉన్నాడు.గత మూడు టెస్టుల్లో అత్యధిక పరుగు లు సాధించిన టాప్‌ ప్లేయర్లు ఐదుగురు వీరే మెరుగైన ఫామ్‌లో కోహ్లీ: ఈ ఏడాది కోహ్లీ మెరు గైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు.

కాగా ఇం గ్లండ్‌తో మూడు టెస్టు మ్యాచ్‌లాడిన కోహ్లీ 405 పరుగులుచేశాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ విశాఖపట్నం లో జరిగిన టెస్టు అత్యధిక స్కోరు 167.అంతే కాదు తన అత్యుత్తమ ఫామ్‌తో ఐసిసి ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ మూడవ స్థానం లో నిలిచాడు.కాగా ఈ సిరీస్‌లో ఒక సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీలను కోహ్లీ సాధించాడు. ద్వితీయ స్థానంలో పుజారా: ఈ సిరీస్‌లో రెండు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఛటేశ్వర పుజారా నిలిచాడు.గత మూడు టెస్టుల్లో పుజారా 338 పరుగులు సాధించాడు.ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ తో జరిగిన టెస్టులో పుజారా 124 పరుగులతో సత్తా చాటాడు.కాగా రాజ్‌కోట్‌ స్టేడియం లో పుజారా హోంగ్రౌండ్‌ కావడం విశేషం.ఆ తరువాత విశాఖపట్నంలో జరిగిన రెండవ టెస్టులో రెండవ సెంచరీ సాధించాడు.

ఇంగ్లండ్‌ బౌలర్స్‌పై పుజారా మంచి ట్రాక్‌ రికార్డు నెలకొల్పాడు.ఈ సిరీస్‌లో పుజారా యావరేజ్‌ 56.33గా ఉంది.ఇంగ్లండ్‌పై పుజారా 5 టెస్టు సెంచరీలు చేయడం విశేషం. తృతీయ స్థానంలో జోరూట్‌ : ప్రస్తుతం ఇంగ్లండ్‌ జట్టులోపామ్‌లోఉన్న ఆటగాడు జోరూట్‌.గత మూ డుటెస్టుల్లో జోరూట్‌ 299పరుగులు సాధించాడు. కాగా యావరేజ్‌ 49.83గా ఉంది.సెంచరీతో పాటు రెండుహాఫ్‌ సెంచరీలను జో రూట్‌ నమోదు చేశాడు.భారత పర్యటనలో జో రూట్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.అయితే రాబోయే టెస్టుల్లో అతడు పుంజుకునే అవకాశం ఉంది. బెన్‌స్టోక్స్‌: ప్రస్తుత సిరీస్‌లో ఇంగ్లండ్‌ జట్టులో మంచి ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌,గత మూడు టెస్టుల్లో 267 పరుగులు సాధించాడు. కాగా సిరీస్‌లోనే అతడు తన క్రికెట్‌ కెరీర్‌లోనే అత్యధిక పరుగులు 128 సాధించాడు.బెన్‌స్టోక్స్‌ యావరేజ్‌ 53.40 ఉంది. అలెస్టర్‌ కుక్‌ : టీమిండియాతో జరుగుతున్న అయిదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఉన్నాడు.కాగా అలెస్టక్‌ కుక్‌ గత మూ డుటెస్టుల్లో 41.00 యావరేజ్‌తో 246 పరుగులు సాధించాడు.తొలి టెస్టు జరిగిన రాజ్‌కోట్‌లో అలె స్టర్‌ కుక్‌ 130 పరుగులతో సెంచరీ సాధించాడు.