ఇంకా ప్రారంభం కాని మ్యాచ్

green field stadium
green field stadium, tiruvanathapuram

తిరువనంతపురం: భారత్‌-న్యూజిలాండ్‌ మూడో టీ20 వర్షార్పణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కురుస్తున్న తేలికపాటి జల్లులు కాస్తా సాయంత్రం చిరుజల్లులుగా మారాయి. ఆ తర్వాత మోస్తరు వర్షంగా మారింది. సిబ్బంది మైదానాన్ని మరిన్ని కవర్లతో కప్పి ఉంచారు. స్టేడియానికి వచ్చిన అభిమానులు గొడుగులు కింద నిరాశగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఇప్పటికే రవిశాస్త్రి, భరత్ అరుణ్, కొందరు న్యూజిలాండ్ ఆటగాళ్లు పిచ్‌ను పరిశీలించారు. 9 గంటలకు మరోమారు పరిశీలించిన అనంతరం మ్యచ్‌పై నిర్ణయం తీసుకుంటారు. మైదానం కనుక ఆటకు సహకరిస్తే మ్యాచ్‌ను చెరో ఐదు ఓవర్లకు కుదించే అవకాశం ఉండే అవ‌కాశం ఉంది.