ఆ రెండు జట్లే ప్రపంచకప్‌ ఫేవరెట్స్‌

du plessis
du plessis

కేప్‌టౌన్‌: వచేచ వన్డే ప్రపంచకప్‌ఖు అంచనాలు లేకుండానే బరిలోకి దిగుతున్నామని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ తెలిపాడు. ఈఓవరాల్‌ మెగా టోర్నీలో భారీ అంచనాలు పెట్టుకుని పోరుకు సిద్ధమైన ప్రతీసారి తమకు నిరాశే మిగిలిందన్న విషయాన్ని డుప్లెసిస్‌ గుర్తు చేసుకున్నాడు. దాంతో తక్కువ అంచనాలతో మాత్రమే ఈసారి ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. కాగా, రాబోవు ప్రపంచకప్‌లో అతిథ్య ఇంగ్లాండ్‌తో పాటు టీమిండియా జట్లే ఫేవరెట్స్‌ అని డుప్లెసిస్‌ అభిప్రాయపడాడడు. ఇంగ్లాండ్‌, భారత్‌ జట్లే ప్రపంచకప్‌ ఫేవరెట్స్‌. ప్రస్తుతం మా జట్టు యువ క్రికెటర్లతో ఉంది. వారంతా ప్రపంచకప్‌ ఆడాలనే ఆతృతతో ఉన్నారు. సాధ్యమైనంత వరకు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టిపెట్టాం. కచ్చితంగా ప్రపంచకప్‌ గెలవాలని మాత్రం ఇంగ్లాండ్‌కు వెళ్లడం లేదు.గతంలో ఫేవరెట్స్‌గా ప్రపంచకప్‌కు సిద్ధమైన ప్రతీ సందర్భంలో ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ఆయా సందర్భాల్లో మేము పేపర్‌పై చాలా పటిష్టమైన జట్టుగానే కనిపించాం. కాకపోతే ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం. క్రికెట్‌ అనేది కాగితాల గేమ్‌ కాదు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. ప్రస్తుత మాది బలమైన జట్టు ఎంతమాత్రం కాదు.అందుచేత భారీ అంచనాలను పెట్టుకోలేదని డుప్లెసిస్‌ తెలిపాడు. గతంలో (1992, 1999, 2007, 2015)నాలుగుసార్లు సఫారీలు సెమీ ఫైనల్‌ వరకు వెళ్లినా ప్రపంచకప్‌ను గెలవలేకపోయారు. దాంతో దక్షిణాఫ్రికాపై చోకర్స్‌ ముద్రపడింది.