ఆ క్రికెటర్‌తో జాగ్రత్తగా ఉండాలి

shoaib-malik
shoaib-malik

ముంబై: ఆసియా కప్‌ టోర్నమెంటులో పాక్‌ సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ షోయబ్‌ మాలిక్‌తో భారత జట్టుకు ప్రమాదమేనని మాజీ క్రికెటర్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌ హెచ్చరించాడు. అతడి బ్యాటింగ్‌ స్టైల్‌కు తగ్గట్టుగా దుబాయి పిచ్‌లు ఉంటాయని, మంచి ఆరంభం లభిస్తే అతనిని అడ్డుకోవడం అసాధ్యమని ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌తో ఇంటర్వ్యూలో లక్ష్మణ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. టోర్నీలో భాగంగా దుబాయి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో సెప్టెంబరు 19న పాక్‌తో మ్యాచ్‌లో భారత్‌ తలపడనుంది.