ఆస్ట్రేలియా బ్యాటింగ్‌… లక్ష్యం 164

Team India
Team India

చెన్నైలో జరుగుతోన్న టీమిండియా, ఆసీస్‌ తొలి వన్డే మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌
281 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ వెంటనే వర్షం పడటంతో మొదట మ్యాచ్‌ను 37 ఓవర్లకు
కుదించారు. విజయ లక్ష్యాన్ని 238 పరుగులుగా నిర్ధేశించారు. అయితే వర్షం ఆగకుండా పడుతూనే ఉండటంతో
ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఆలస్యంగా ప్రారంభించింది. దీంతో ఈ వన్డేలో ఒవర్లను మరోసారి కుదించారు. 21 ఓవర్లలో
164 లక్ష్యాన్ని ఇచ్చారు. క్రీజులో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ 6, హిల్టన్‌ కార్ట్‌రైట్‌ శూన్య పరుగులతో ఉన్నారు.