ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫెదరర్‌,వావ్రింకా జోరు

FEDERAAR
FEDERAAR

ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫెదరర్‌,వావ్రింకా జోరు

 

మెల్‌బోర్న్‌:ఆస్ట్రేలియా ఓపెన్‌లో స్విస్‌ సీనియర్‌ ఆటగాళ్లు ఫెద రర్‌,వావ్రింకా జోరు కనబరుస్తు న్నారు. ఒకప్పటి నంబర్‌ వన్‌, ప్రస్తుత 17వ ర్యాంకు రోజర్‌ ఫెదరర్‌,నాలుగవ ర్యాంకు వావ్రింకా సెమీఫైనల్‌ చేరుకు న్నారు. కెరీర్‌లో 13వ సారి ఆస్ట్రే లియా సెమీస్‌ చేరుకున్న పెదరర్‌ క్వార్టర్స్‌లో జర్మనీ ఆటగాడు మిసా జ్వేరెవ్‌ను 6-4,7-5, 6-2తో వరుససెట్లలో ఓడిం చారు. మునుపటి ఆటతీరుతో అభిమాను లను మురిపించాడు. మరో క్వార్టర్స్‌లో నాలుగవ ర్యాంకు స్టాన్‌ వావ్రింకా అద్భుతవిజయంసాధించాడు. ప్రాన్స్‌ ఆటగాడు విల్‌ఫ్రెడ్‌ సొంగాను 7-6(7,2), 6-4,6-3తో వరుస సెట్లలో మట్టి కరిపించాడు.బలమైన సర్వీసులతో విరుచుకు పడ్డాడు.తొలి సెమీ ఫైనల్ల్‌ వావ్రింకా తన సహచరుడు ఫెదరర్‌్‌తో తలపడనుండటం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది.