ఆర్మీకి ధోనీ సందేశం

M S DHONI
M S DHONI

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎమ్మెస్‌ ధోని ఆర్మీ యూనిఫాంలో వచ్చి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా పద్మభూషణ్‌ అవార్డు అందుకున్నాడు. ఇలా ఆర్మీ యూనిఫాంలో వచ్చి అవార్డు అందుకోవడం తన సంతోషాన్ని పదింతలు చేసిందని ధోనీ అన్నాడు. ఆర్మీలో పనిచేస్తున్న వాళ్లు ,వాళ్ల కుటుంబాలు చేస్తున్న త్యాగాల వలన రాజ్యాంగ హక్కులను హాయిగా పొందే అవకాశం మనకు దక్కింది అని ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగానే 9 లక్షల పైగా లైక్స్‌ వచ్చాయి.