ఆఫ్గాన్‌తో మ్యాచ్‌లో సార‌థిగా ర‌హానే

AJINKYA RAHANE
AJINKYA RAHANE

న్యూఢిల్లీః ఆఫ్గానిస్థాన్‌తో జూన్‌లో జరగబోయే టెస్ట్ ‌మ్యాచ్‌కు టీమిండియా సారథిగా అజింక్య రహానే వ్యవహరించే అవకాశం ఉంది. ప్రస్తుతం వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రహానే సారథ్యంలో టీమిండియా జూన్‌ 14న బెంగళూరులో జరిగే టెస్ట్‌ మ్యాచ్‌లో అఫ్గాన్‌‌తో తలపడనుంది. కోహ్లీకి కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు వెళ్లనుండటంతో రహానేకు సారథ్య బాధ్యతలను అప్పగించనున్నారట.