ఆన్‌ ఫీల్డ్‌ ఘటనలపై బోర్డు స్పందించాలి: చాపెల్‌

s4
cchpel

ఆన్‌ ఫీల్డ్‌ ఘటనలపై బోర్డు స్పందించాలి: చాపెల్‌

కోహ్లీ ఎమోషన్స్‌ కంట్రోల్‌ చేసుకోవాలి న్యూఢిల్లీ: టీమిండియా,ఆస్ట్రేలియా మధ్య జరు గుతున్న టెస్టు సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో చోటు చేసుకున్న స్లెడ్జింగ్‌ ప్రమాదకర స్థాయిలో ఉందని ఆసీస్‌ లెజెండరీ ఆటగాడు ఇయాన్‌ చాఫెల్‌ స్పష్టం చేశాడు.మైదానంలో శృతిమించి పోతున్న ఈ తరహా చర్యలను ఆపేందుకు ఆయా క్రికెట్‌ బోర్డులు నడుంబిగించాల్సి అవసరం ఉందన్నాడు.ఛాపెల్‌ రాసిన కాలమ్‌లో తీవ్రంగా స్పందించాడు.ఇక ఆటగాళ్ల ఆన్‌ ఫీల్డ్‌ ఘటనలపై బోర్డు అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది.ఆస్ట్రేలియా జట్టు ఆట గాళ్లు రాళ్లు విసిరేందుకు సిద్దంగా ఉన్నారని నేను భావించడం లేదన్నాడు.గతంలో ఆస్ట్రేలియా, భారత్‌ జట్టు మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో కూడా ఆటగాళ్లు స్లెడ్జింగ్‌ చేసుకున్న ఘటనలు అనేకం. అయితే ఆ దూకుడు ఎప్పుడు పరిధిలోనే ఉం డటంతో క్రికెట్‌కు మంచే జరిగేది.అయితే ఆన్‌ ఫీల్డ్‌లో ఆటగాళ్ల వ్యవహారాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి.దీనిపై బోర్డులు మాత్రం పూలిష్‌గా వ్యవహరిస్తున్నాయి అని తీవ్రంగా వ్యాఖ్యా నించాడు.ఇలానే సాగితే సమస్య వస్తుంది. ఆటగాళ్ల కారుకూతలకు స్టేడియంలో అంపైర్లు, ప్రేక్షకులే సాక్ష్యం. వారి పిచ్చి కూతలకు ఇకనైనా పుల్‌స్టాప్‌ పెట్టండి.ఒకవేళ బోర్డు అధికారులు ఈ తరహా చర్యలను చూస్తూ కూర్చుంటే అది వారి చేతకానితనమే అవుతుంది.అని చాపెల్‌ పేర్కొ న్నాడు. బెంగళూరు టెస్టులో టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ వ్యవహరించిన తీరును చాపెల్‌ విమ ర్శించాడు. కెప్టెన్‌ కోహ్లీ తన ఎమోషన్స్‌ను కం ట్రోల్‌ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కెప్టెన్‌ గా అన్ని ఎమోషన్స్‌ను కోహ్లీ అదుపు చేసుకో వాల్సి ఉంటుంది అని చాపెల్‌ పేర్కొన్నాడు.