ఆట‌గాళ్ల కంటే టాప్-20 అంపైర్ల వేత‌నాలే మెరుగు

UMPIRE
UMPIRE

న్యూఢిల్లీః బీసీసీఐ తాజాగా సవరించిన జీతాల ప్రకారం.. దేశవాళీ ఆటగాళ్ల కంటే టాప్-20 అంపైర్ల వేతనాలే ఎక్కువగా ఉండనున్నాయి. టీ20లు తప్ప అన్ని మ్యాచ్‌లకు ప్రస్తుతం రోజుకు రూ.20 వేలు ఇస్తుండగా, దానిని ఇకపై రూ.40 వేలకు పెంచనున్నారు. టీ20లకు రూ.10 నుంచి రూ.20 వేలకు పెంచుతున్నారు. అదే ఓ దేశవాళీ క్రికెటర్‌కు రోజుకు రూ.35 వేలు మాత్రమే లభిస్తుంది. అయితే, వీరికి బీసీసీఐ లాభాల్లో వాటా కూడా ఉంటుంది.
2017-18లో టాప్ 20 అంపైర్లు మొత్తం 281 మ్యాచుల్లో బాధ్యతలు నిర్వర్తించారు. వీటిలో సీనియర్ జట్ల మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. 809 మ్యాచుల్లో 85 మ్యాచులకు అధికారిక గుర్తింపు లభించింది. ఇందులో పురుషుల, మహిళల జూనియర్ టోర్నమెంట్లు కూడా ఉన్నాయి.