ఆటగాళ్ల భద్రతే మా తొలి ప్రాధాన్యత…

Sashank Manohar

శశాంక్‌ మనోహర్‌.


దుబాయి: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతో సంబంధాలను తెంచుకోవాలని కోరుతూ బిసిసిఐ శుక్రవారం రాసిన లేఖపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి స్పందించింది. శుక్రవారం సమావేశమైన బిసిసిఐ పాలకుల కమిటీ భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఛైర్మన్‌ వినోద్‌రా§్‌ు వెల్లడించారు. ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో పాక్‌తో మ్యాచ్‌ ప్రస్తావన లేకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతో క్రికెట్‌ సంబంధాలను నిలిపివేయాలని ఐసిసికి లేఖ రాసింది. ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఐసిసికి రాసిన లేఖలో విన్నవించింది. దీనిపై శనివారం ఐసిసి ఛైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ మాట్లాడుతూ బిసిసిఐ రాసిన లేఖ మాకు చేరింది. ప్రపంచకప్‌లో ఆటగాళ్ల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత. దీనికి ఎప్పుడూ పెద్ద పేటే వేస్తాం. మార్చి 2వతేదీన జరగనున్న ఐసిసి సభ్యుల సమావేశంలో బిసిసిఐ రాసిన లేఖపై పూర్తిస్థాయిలో చర్చిస్తాం. కచ్చితంగా బిసిసిఐకి భద్రతాపరమైన హామీ ఇస్తాం. ప్రపంచకప్‌లో మా ఏర్పాట్లుతో బిసిసిఐని సంతృప్తి పరుస్తామని అన్నారు. పాకిస్తాన్‌ ఆశ్రయమిస్తున్న ఉగ్రవాదులు పుల్వామాలో భారీ ఉగ్రదాడికి తెగబడ్డారు. ఈ ఘోర ఘటనలో భారత్‌కు చెందిన సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు 44మంది అమరులయ్యారు. భారత గడ్డపై జరిగిన ఈ దాడిని అనేక మంది ఖండిస్తున్నారు. దాడిని దృష్టిలో పెట్టుకొని మా అభ్యంతరాలు, సెంటిమెంటును ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నాం. ఉగ్రదాడి నేపథ్యంలో త్వరలో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే ఆటగాళ్లు, అధికారుల భద్రత, క్షేమం గురించి బిసిసిఐ ఆందోళన పడుతోంది. భారత్‌లో జరిగిన ఉగ్రదాడిని ఐసిసిలోని చాలా సభ్యదేశాలు (బ్రిటన్‌ సహా)గట్టిగా ఖండించాయి. అందుకే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలతో సంబంధాలు తెంచుకోవాలని క్రికెట్‌ ప్రపంచాన్ని బిసిసిఐ కోరుతోంది. ఐసిసి ప్రపంచకప్‌ను వీక్షించేందుకు వచ్చే భారత అభిమానుల భద్రత, క్షేమం గురించి బిసిసిఐ భయపడుతోంది. మైదానాల్లో ఆటగాళ్లు, మ్యాచ్‌ అధికారులు, అభిమానులకు ఐసిసి, ఈసిబి పటిష్ట భద్రత కల్పిస్తాయని బిసిసిఐ విశ్వసిస్తోంది. ఈవిషయంలో బిసిసిఐకి అన్ని హక్కులు ఉన్నాయి. గౌరవనీయ సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్‌ పాలకుల కమిటీ తరుపున బిసిసిఐ ఈ లేఖను పంపిస్తోంది.