అర్జున్‌ టెండూల్కర్‌ యార్కర్‌తో గాయపడ్డ ఇంగ్లాండ్‌ క్రికెటర్‌

ARJUN TENDULKAR1
ARJUN TENDULKAR1

అర్జున్‌ టెండూల్కర్‌ యార్కర్‌తో గాయపడ్డ ఇంగ్లాండ్‌ క్రికెటర్‌

లండన్‌: మైదానంలో దాదాపు రెండు దశాబ్ధాల పాటు మాస్టన్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన దూకుడుతో ఇంగ్లాండ్‌ క్రికెటర్లను ఆటాడుకు న్నాడు. ఇప్పుడు మళ్లీ ‘టెండుల్కర్‌ పేరు వినిపిస్తేనే వాళ్లు హడలిపోతున్నారు. దానికి కారణం యువ అర్జున్‌ టెండూల్కర్‌ నెట్స్‌లో పదునైన యార్కర్‌ బంతులు విసురుతూ అగ్ర శ్రేణి అంతర్జాతీయ బ్యాట్స్‌మెన్‌కి సైతం వణుకు పుట్టిస్తున్నాడట. ఈ ఎడమచేతి పేస్‌ బౌలర్‌ గత కొద్ది రోజులుగా ఇంగ్లండులోనే ఉంటూ క్రికెట్‌పై శిక్షణ తీసుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ఆరంభంకానున్న నేపథ్యంలో ఇంగ్లాండ్‌ క్రికెటర్లు లార్డ్స్‌ మైదానంలో నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా…అక్కడికి వచ్చిన అర్జున్‌ టెండూ ల్కర్‌ కాసేపు బౌలింగ్‌ చేశాడట. అయితే అర్జున్‌ వేసిన తొలి యార్కర్‌ బంతినే ఇంగ్లాండ్‌ కీప్‌ /బ్యాట్స్‌మెన్‌ బారిస్టో అడ్డుకోలేక గాయపడినట్లు డెయిలీ మెయిల్‌ కథనం ప్రచురించింది. నొప్పితో విలవిలలాడిపోయిన బారిస్టో ప్రాథమిక చికిత్స తర్వాత తొలి టెస్టుకి అందుబాటులోనే ఉన్నట్లు ఇంగ్లాండ్‌ ప్రకటించింది. ఎడమ చేతి వాటం పేస్‌ బౌలింగ్‌తో పాటు ఎడమచేతి వాటం బ్యాటింగ్‌తో ఆల్‌ రౌండర్‌గా గత కొంతకాలంగా అర్జున్‌ టెండూల్కర్‌ అందర్నీ ఆకర్షిస్తున్నాడు. ఇప్పటికే ముంబయి అండర్‌-14, అండర్‌-16 జట్ల తరుపున మెరుగైన ప్రదర్శన చేశాడు.