అభినవ్‌ బింద్రా

Abhinav Bindra

ఒలింపిక్స్‌కు భారత గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా
అభినవ్‌ బింద్రా
సల్మాన్‌కు ఝలక్‌
న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్‌ 2016కు గుడ్‌ విల్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ని ఎంపిక చేయడంపై పలు విమర్శలు రావడంతో ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఒఎ) వెనక్కి తగ్గింది.కాగా రియో ఒలింపిక్స్‌కు గుడ్‌ విల్‌ అంబాసిడర్‌గా అభినవ్‌ బింద్రా పేరును ఖరారు చేసింది.సల్మాన్‌ఖాన్‌కు గుడ్‌ విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరించే అర్హత లేదంటూ పలువురు ప్రముఖలు విమర్శిం చడంతో ఐఒఎ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇండియన్‌ టీమ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ బృందంలో క్రికెటర్‌ సచిన్‌, సంగీత దర్శకుడు ఎఆర్‌ రహమాన్‌ను చేర్చాలని భావిస్తుంది.