అనుష్కకు నెటిజన్లు చురకలు

Virat kohli Team
Virat kohli Team

ఇది క్రికెట్‌ టూర్‌? లేక హనీమూన్‌ టూర్‌? అంటూ భారత క్రికెట్‌జట్టు సారథి విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్కశర్మపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అదే విధంగా బిసిసిఐపై కూడా నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బిసిసిఐ సామాజికి మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన ఒకఫోటోయే ఈ ట్రోలింగ్‌కు కారణం. మరికోద్దీ గంటల్లో లండన్‌లో లార్డ్స్‌వేదికగా ఇంగ్లాండ్‌-భారత్‌ ఆటగాళ్లు ప్రత్యేక ఆహ్వానం మేకు మంగళవారం నాడు భారతహైకమీషన్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఆటగాళ్లు, సిబ్బంది, మేనేజ్‌మెంట్‌తో పాటు అనుష్క కూడా హైకమీషన్‌ కార్యాలయానికి వెళ్లింది. ఆ కార్యాలయం ఎదుట అందరూ కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోను బిసిసిఐ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. ఈఫోటోయే అభిమానుల ఆగ్రహానికి హేతువైంది. టీమిండియా వైస్‌ కెప్టెన్‌ ఎక్కడో వెనక వరసలో ఉంటే అనుష్క మాత్రం మందు ఉంది. టిమిండియాకు అనుష్క ఎప్పుడు ఎంపికైంది. ఇంతకీ ఆమె బౌలరా? బ్యాట్స్‌మెన్‌? ఇది క్రికెట్‌టూరా? లేకపోతే హనీమూన్‌ టూరా? ఇదేమైనా ఫ్యామిలీ ఫంక్షనా? అనుష్క ఇంత ప్రాధాన్యం ఎందుకు? అంటూ నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు.