అథ్లెట్లను హెచ్చరించిన ఉసేన్‌ బోల్ట్‌

athlets
usen bolt

లండన్‌: ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌ లండన్‌లో శుక్రవారం నుండి జరగబోతుంది.
వాటిలో పాల్గొనడానికి వచ్చిన ప్రపంచ అథ్లెట్‌, జమైకా చిరుత ఉసేన్‌బోల్ట్‌ డోపింగ్‌కు
పాల్పడిన వారిపై విరుచుకుపడ్డారు. డోపింగ్‌కు పాల్పడితే వారి జీవితాన్ని వారే చేజేతులా
నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఇంతకంటే నీచమేన పని మరొకటి లేదుఅని,
డోపింగ్‌ను నిరోధిస్తే, క్రీడలకు మేలు చేసినవారమవుతాము అని, ఈ విషయాన్ని అథ్లెట్లు
అర్ధం చేసుకోవాలని ఆయన విన్నవించాడు. ఈ ఛాంపియన్‌ షిప్‌ తర్వాత ఆయన తన
కెరీర్‌కు స్వస్థి చెప్పనున్నారు.