అగ్రస్థానంలో కొనసాగుతున్న రవీంద్ర జడేజా

JADEJ A, ASWIN
JADEJ A, ASWIN

అగ్రస్థానంలో కొనసాగుతున్న రవీంద్ర జడేజా

దుబాయి: భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని చేజార్చుకున్నాడు. బుధవారం ఐసిసి ప్రకటించిన ర్యాంకింగ్స్‌ జాబితాలో అశ్విన్‌ని వెనక్కినెట్టి శ్రీలంక సీనియర్‌ స్పిన్నర్‌ రంగనా హెరాత్‌ ద్వితీయ స్థానానికి ఎగబాకాడు. ఇటీవల జింబాబ్వేతో ముగిసిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో 11వికెట్లు పడగొట్టిన హెరాత్‌ శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈజాబితాలో ప్రస్తుతం అగ్రస్థానంలో 898 పాయింట్లతో రవీంద్ర జడేజా ఉండగా…తర్వాత 32పాయింట్ల తేడాతో హెరాత్‌ (866), అశ్విన్‌ (865), ఆస్ట్రేలయా పేస్‌ బౌలర్‌ వుడ్‌ (826), ఇంగ్లాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ (826) నిలిచారు. టెస్టు బ్యాట్స్‌మెన్‌ జాబితాలో టాప్‌-5లో ఎలాంటి మార్పులు జరగలేదు. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌, తర్వాత ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌, భారత మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా, భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఆల్‌ రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ నెం.1 స్థానంలో ఉండగా…జడేజా, అశ్విన్‌ తర్వాత రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.