టిడిపి విజయం కోసం ఎన్నారైల ప్రచారం!

తానా అధ్యక్షుడు కోమటి జయరామ్‌

నందిగామ: ఏపి రాష్ట్రాన్ని అమెరికాతో సమానంగా అభివృద్ది చేయగల సత్తా చంద్రబాబుకే ఉందని తానా అధ్యక్షుడు కోమటి జయరామ్‌ అన్నారు. నందిగామలో ఆయన తంగిరాల సౌమ్య విజయం కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ఆర్థిక ఇబ్బందులలో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ల గల తెగువ చంద్రబాబుకే ఉందని, ప్రపంచ దేశాల్లో ఆయన పాలన పట్ల చర్చ కొనసాగుతుందని అన్నారు. ప్రపంచంలోని తెలుగువారు చంద్రబాబు విజయం కోసం ఎదురుచూస్తున్నారని, ఆయన చొరవతోనే అభివృద్ది చెందిన పారిశ్రామిక వేత్తలు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ సారి జరగబోయే ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని అన్నారు. ఆయన విజయం కోసం ఎంతో మంది ఎన్నారైలు స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేస్తున్నారన్నారు. నందిగామ నుంచి సౌమ్యను, విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

వార్త ఈ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/