ఒంటికి నిప్పంటించుకుని ఎన్నారై ఆత్మహత్య

suicide
suicide

అమెరికాలోని వైట్‌ హౌస్‌ సాక్షిగా ఎన్నారై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అందరూ చూస్తుండగానే మంటల్లో కాలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
మేరీల్యాండ్‌ ప్రాంతంలో నివసిస్తున్న అర్నవ్‌ ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లాడని, తిరిగి ఇంటికి చేరుకోక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వైట్‌హౌస్‌ వద్ద ఇలాంటి సంఘటనలు జరగడం ఇది రెండోసారి. రెండు నెలల క్రితం ఇలాగే ఒంటికి నిప్పంచించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/