భారత్‌-పాక్‌ మధ్య యుద్ధం వస్తే అణ్వాయుధాలతోనే

Imran khan
Imran khan

పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ఈసారి ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా అణు విషం కక్కారు. భారత్‌-పాక్‌ మధ్య యుద్ధం వస్తే అణ్వాయుధాలతోనే ముగుస్తుందని, దీని ప్రభావం మిగతా దేశాలపైనా పడుతుందని హెచ్చరించారు. కశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేస్తే రక్తపాతం జరుగుతుందని జోస్యం చెప్పిన ఇమ్రాన్‌.. పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిబిరాలే లేవంటూ అబద్దాలు వల్లెవేశారు. ఇమ్రాన్‌ ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. 15 నిమిషాలే మాట్లాడాలన్న అనవాయితీన అత్రికమించి దాదాపు 50 నిమిషాలు ప్రసంగించారు. ఎక్కువగా అణుయుద్ధం, కశ్మీర్‌ అంశాలపైనే మాట్లాడారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/