హెచ్‌1 బి వీసాల నిబంధనలతో యుఎస్‌ ఐటిపై ప్రతికూల ప్రభావం!

H-1B Visa
హెచ్‌1 బి వీసాల నిబంధనలతో యుఎస్‌ ఐటిపై ప్రతికూల ప్రభావం

వాషింగ్టన్‌: మూడేళ్ల తాత్కాలిక వర్క్‌ పర్మిట్‌కుఅనుమతించే హెచ్‌1బి వీసాలకు సంబంధించి డోనాల్డ్‌ట్రంప్‌అధ్యక్షుడుఅయిన తర్వాత విధించిన నిబంధనలు కఠినతరం చేసిన సంగతి తెలిసిందే..అయితే హెచ్‌1 బి వీసాల్లో నిబంధల మార్పులు అమెరికా ఐటి రంగంపై ప్రతికూలంగా ప్రభావం చూపే అవకాశం ఉందని ఐటి నిపుణులు విశ్లేషిస్తున్నారు.. ఈ నిర్ణయం వల్ల భారత్‌ వంటి దేశాల నుంచి నైపుణ్యంఉన్న ఐటి ఉద్యోగుల రాకకు తీవ్ర అవరోధం ఏర్పడుతుందని అమెరికా అత్యున్నత అధకారి ఒకరు వ్యాఖ్యానించారు.. ఇదిలా ఉండగా ఐటి రంగానికి సంబంధించి సరైన వ్యక్తులకు ఆహ్వానం పలకటం, అవకాశాలతో ఇరుదేశాల ఐటి రంగాలలకు మంచిదని, దీంతోనే రెండుదేశాల ఐటి రంగాలు నూతన ఆవిష్కరణలు, అభివృద్ధి జరుగుతుందని సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ తన నివేదికలో స్పష్టంచేసింది.. అదేవిధంగా హెచ్‌ 1 బి వీసా వల్ల రెండుదేశాల ఆర్థికవ్యవస్థలులబ్దిపొందిన మాట వాస్తవమని, ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యంచేయటం వల్ల భారత్‌ నుంచి వచ్చే నైపుణ్యం రాకుండా పోతుందని,ఐటి రంగంలో అమెరికా వెనుకబడుతుందని సిజిడి ఫెలో గౌరవ్‌ఖన్నా అన్నారు.. భారత్‌నుంచి మేథో వలసలు తగ్తితే ఆదేశం లాభపడుతుందని పలుపరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఆయన పేర్కొన్నారు.