హక్కులు కాపాడాలన్న ప్రాథమిక విధికి కట్టుబడిఉన్నాం

White House
White House

హక్కులు కాపాడాలన్న ప్రాథమిక విధికి కట్టుబడిఉన్నాం

వాషింగ్టన్‌: అమెరికాలో పౌరులందరి హక్కులను కాపాడాలనే ప్రాథమిక విధికి కట్టుబడి ఉన్నామని వైట్‌హౌస్‌ ప్రతినిధి సీన్‌ స్సైసర్‌ అన్నారు.. భారతీయ ఇంజనీర్‌ కూచిభొట్ల శ్రీనివాస హత్యపై వైట్‌హౌస్‌ తొలిసారి స్పందించింది.. శ్రీనివాస్‌ కాల్పుల ఘటన కలచివేసిందని ఆయన అన్నారు. జాతి, మతం, ఆధారంగా అమెరికాలో హింసకు తావులేదని, ఏ పౌరుడైనా మత ధర్మాన్నైఆ స్వేచ్ఛగా పాటించవచ్చునని వైట్‌హౌస్‌ ప్రతినిధి పేర్కొన్నారు.