శ్వేత సౌధంలో మ‌రోసారి పాగా వేయాలి

TRUMP
TRUMP

వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించే నాయకుడే లేడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2020 ఎన్నికల్లో తాను మళ్లీ పోటీచేస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతీ ఒక్కరు నన్ను కోరుకుంటున్నారు. ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీలో నాకు పోటీ ఇవ్వగలిగిన నాయకుడే లేడు. నిజానికి వారికి సరైన అభ్యర్థి దొరకడం కష్టమే. ఇప్పటికిప్పుడు నాకైతే అందులో ఎవరూ కనిపించడం లేదు అని అన్నారు. ఆరోగ్యం తదితర విషయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేమని చెప్పిన ఆయన, వైట్‌హౌస్‌లో మరో పర్యాయం తాను ఉండాలని తన మద్దతుదారులు కోరుకుంటున్నట్లు తెలిపారు.