లండన్‌లో టిఆర్‌ఎస్‌ విజయోత్సవ వేడుకలు

trs victory celebrations at london
trs victory celebrations at london

లండన్‌: లండన్‌లో ఎన్నారై టిఆర్‌ఎస్‌ సెల్‌ యూకే ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్‌ విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుండి భారీగా టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు, కేసిఆర్‌ అభిమానులు మరియు ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌ పెద్దిరాజు మరియు కార్యదర్శి సత్యమూర్తి చిలుముల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్‌ చిత్ర పటానికి పూలతో నివాళులర్పించి, అమరవీరులని స్మరించుకుని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కేకును కట్‌ చేసి ఆనందోత్సహాలతో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.