భారతీయులే అధికం

h1b

భారతీయులే అధికం

హెచ్‌-1బి వీసా పొందిన ఉద్యోగుల్లో భారతీయులే అధికంగా ఉన్నారు.. తాజా గణాంకాల ప్రకారం హెచ్‌-1బి వీసాల కోసం గడచిన 11 ఏళ్లలో దరఖాస్తు చేసుకున్న భారతీయుల సంఖ్య 21 లక్షలకు చేరింది.. యుఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ నివేదిక ప్రకారం సగత జీతం 92,318 అమెరికన్‌ డాలర్లు.. ఈ నివేదిక ప్రకారం 2007 నుంచి 2017 వరకు 34 లక్షల మంది హెచ్‌-1బి వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు..వీరిలో భారతీయుల నుంచి దరఖాస్తులు చేసుకున్నవారి సంఖ్య 21 లక్షలు దాకా ఉంది. వీరిలో 26 లక్షల మందికి అమెరికా హెచ్‌-1బి వీసాలను మంజూరుచేసింది.