ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను ఆద‌ర్శంగా తీర్చిదిద్దుతాంః కోమ‌టి జ‌య‌రాం

digital classes
digital classes

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరామ్‌ అన్నారు. ఏపీ జన్మభూమి కార్యక్రమంలో భాగంగా తానా ఆర్థిక సహాయంతో పరవాడ-1 వెన్నెలపాలెం-1 అంగన్వాడీ కేంద్రాల్లో రూ.6 లక్షలు వెచ్చించి తీర్చిదిద్దిన డిజిటల్‌ తరగతి గదులను పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జయరామ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 2500 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు, 200 అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, 150 శ్మశన వాటికలను ఎన్నారైల సహకారంతో తీర్చిదిద్దామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుని ప్రతి గ్రామానికి ఎన్‌ఆర్‌ ఐని అనుసంధానం చేసి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.
పరవాడ మండలంలో మరో 24 లక్షల వెచ్చించి 8 అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలో డిజిటల్‌ తరగతులతోపాటు రూ.10 లక్షలతో పరవాడ శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.