ప్రైవేటు హోదాలోనే జూనియర్ ట్రంప్ పర్యటన

Jr trump
Jr trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద కుమారుడు జూనియర్‌ ట్రంప్‌ భారత్‌లో వారం రోజుల పాటు చేపట్టిన పర్యటన ప్రైవేటు హోదాలోనే కొనసాగుతుందనీ, అది అధికారికం కాదనీ అమెరికా విదేశాంగ శాఖ సృష్టం చేసింది. ట్రంప్‌ వ్యాపార సంస్థల్లో కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడి హోదాలో జూనియర్‌ ట్రంప్‌ ఉన్నారు. గురుగ్రామ్‌, కోల్‌కతాలలో ఉన్నవాటితో సహా అత్యంత విలాసవంతమైన స్థిరాస్తుల్ని అమ్మడానికి ఆయన ఈ పర్యటన చేపట్టారు.