తెలుగు విద్యార్ధులకు ఆటా న్యాయసహాయం

ATA
ATA

హైదరాబాద్‌: పే టు సే స్కాంలో భాగంగా అమెరికాలో దర్యాప్తు ఎదుర్కొంటున్న విద్యార్ధులకు విముక్తి కలిగించేందుకు అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ (ఆటా-తెలంగాణ) తన కార్యాచరణను మరింత వేగవంతం చేసింది. విద్యార్ధులను కస్టడీ నుంచి విముక్తి కలిగించేందుకు నేరుగా డిటెయిన్‌ సెంటర్ల వద్దకు వెళ్లింది. మిచిగాన్‌ థియోడర్‌ యునైటెడ్‌ స్టేట్స్‌ కోర్ట్‌ హౌస్‌ వద్ద ఫెడరల్‌ క్రిమినల్‌ అటార్నీ ఎడ్వర్డ్‌ భజోకాతో సమావేశమయ్యారు. విద్యార్థుల తరఫున వాదిస్తున్న ఎడ్వర్డ్‌తో సమావేశం సందర్భంగా కస్టడీలో ఉన్న వారిని విముక్తి చేసేందుకు సత్వరం ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూడాలని ఆయనను ఈ సందర్భంగా ఆటా బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ వెంకట్‌ మంతెన కోరారు.