తెలంగాణ బిడ్డ అప్పిరెడ్డి అన్నపరెడ్డి కృషితో ‘డిజిటల్‌ దొండపాడు’

Appireddy Annapureddy, NRI
Appireddy Annapureddy, NRI

తెలంగాణ బిడ్డ అప్పిరెడ్డి అన్నపరెడ్డి కృషితో ‘డిజిటల్‌ దొండపాడు’

తెలంగాణ బిడ్డ, ప్రవాసభారతీయుడు అప్పిరెడ్డి అన్నపరెడ్డి తన రాష్ట్రానికి తన వంతు సేవచేయాలని సంకల్పించారు. ఆ ఆలోచనలో భాగంగానే పుట్టిన ఊరును దత్తత తీసుకున్నారు.. గ్రామాన్ని అభివృద్ధి పర్చటంతోపాటు సంపూర్ణ డిజిటల్‌ గ్రామంగా తీర్చిదిద్దారు.. ఎనారైల ప్రియ ప్రాజెక్టు డిజిథాన్‌లో భాగస్వామ్యమై, తన సొంత గ్రామాన్ని డిజిటల్‌ గ్రామంగా రూపుదిద్దుకునేలా కృషిచేశారు..ఇపుడు తొలి డిజిటల్‌ గ్రామంలో సూర్యాపేట జిల్లాలో దొండపాడు ముస్తాబైంది…నూరుశాతం అక్షరాస్యత గల పల్లెగా అవతరించింది. ఇదిలా ఉండగా తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టిటా), ఎన్నారైలు సంయుక్తంగా గ్రామాలోల డిజిటల్‌ అక్షరాస్యతను పెంచే కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే..దీంతో ఎన్నారై అప్పిరెడ్డి అన్నపనరెడ్డి ఆధ్వరంయలో తెలంగాణలో తొలి డిజిటల్‌ గ్రామంగా రూపుదిద్దుకుంది దొండపాడు…