తానా మ‌హాస‌భ‌ల‌కు వాషింగ్ట‌న్ డిసిలో వేదిక‌

TANA
TANA

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ ద్వైవార్షిక మహాసభలకు 2019 జూలై 4,5,6 తేదీలలో వాషింగ్టన్ డీసీ లోని వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కాబోతోంది. ప్రవాస తెలుగు సంఘాల్లో మొదటిది, పెద్దది అయిన తానా అంగరంగ వైభవంగా ప్రతి రెండేళ్ళకొకసారి జరుపుకునే మహాసభలకు 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాషింగ్టన్ డీసీ ఆతిధ్యం ఇవ్వబోతోంది. ఈ మేరకు జూన్ 15వ తేదీన తానా అధ్యక్షులు సతీష్ వేమన మరియు కార్యవర్గబృందం వాషింగ్టన్ డీసీ లో వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ అధికారులతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.