డ‌యానా అంటే అంతులేని అభిమానంః ట్రంప్‌

trump and dayana
trump and dayana

వాషింగ్ట‌న్ః బ్రిటీష్‌ యువరాణి ప్రిన్సెస్‌ ఆవ్‌ వేల్‌ అంటే తనకు ఎంతో పిచ్చి అంటూ అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్య టేపులో బయటపడ్డాయి. 2000లో రేడియో హోస్ట్‌ హెవార్డ్‌ స్టెర్న్‌ కు ఇంటర్వ్యూలో ఈ మేరకు ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. డయానా చాలా అందగత్తె అని, డయానాతో  కలసి  తాను గ‌డిపేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడిన‌ని చెప్పారు. డయానాను ట్రంప్‌ చాలాసార్లు కలిశారట, ఈ సందర్భంగా ఎంతో విలువైన బొకేలను డయానాకు ట్రంప్‌ ఇచ్చేవారట. ఒకనొక సందర్భంతో తనపై ట్రంప్‌ కు ఉన్న అభిమానాన్ని చూసి ఏం చేయాలో కూడా డయానాకు అర్ధం కాలేదట. యాక్సిడెంట్‌లో డయానా చనిపోయిన తర్వాత, ఆమెతో డేటింగ్‌ చేయలేకపోవడం తన జీవితంలో అతిపెద్ద లోటు అని స్నేహితులతో ట్రంప్‌ చెప్పాడట.