ట్రంప్ అంత‌ర్గ‌త భ‌ద్రతా స‌ల‌హాదారుడి రాజీనామా

TOM BOSSERT
TOM BOSSERT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు అంతర్గత భద్రత వ్య‌వ‌హారాల్లో సలహాదారుడిగా ఉన్న టామ్‌ బాసెర్ట్‌ తన పదవికీ రాజీనామా చేశారు. ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న రాజీనామాల కోవలోనే ఇది కూడా చేరింది. దేశ భద్రత, రక్షణల విషయంలో టామ్‌ నిబద్ధతను అధ్యక్షుడు కొనియాడినట్లు శ్వేతసౌధం పత్రికా వ్యవహారాల కార్యదర్శి శారా శాండర్స్‌ తెలిపారు.