జ్ఞానాన్ని కొలిచే సాధ‌నం

brain
brain

కాలిఫోర్నియాః ఎంత బరువున్నామో, ఎంత పొడ వున్నామో చెప్పేందుకు ప్రత్యేక పరికరాలున్నాయి. అలానే, జ్ఞానాన్ని కూడా కచ్చితంగా కొలిచి చెప్పవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ఇందు కోసం శాన్‌డిగో విజ్డమ్‌ స్కేల్‌ (ఎస్‌డీ-వైజ్‌) పేరుతో ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు. ఆయా సందర్భాల్లో మెదడులోని 6 ప్రాంతాలు స్పందించే తీరును బట్టి జ్ఞానాన్ని నిర్వచించవచ్చని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. ఈ ఆరింటిలో ఐదింటిని ఎస్‌డి-వైజ్‌ పరికరం ద్వారా కొలిచేందుకు అవకాశం ఉందని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ దిలీప్‌ జెస్ట్‌ తెలిపారు.