చురుగ్గా ఎపి ఎన్నార్‌టిఎస్‌ సభ్యత్వ నమోదు

NRTS in Kuwait
APNRTS Team Memberships in Kuwait

చురుగ్గా ఎపి ఎన్నార్‌టిఎస్‌ సభ్యత్వ నమోదు

కువైట్‌: ఎపి ప్రభుత్వం ఆధ్వరంయలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెన్షియల్‌ తెలుగుసొసైటీ (ఎన్‌ఆర్టఇఎస్‌) తన కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ప్రవాసతెలుగువారిని ఒకేతాటిపైకి తీసుకురావటమే లక్ష్యంగా ఎపి సిఎం చంద్రబాబు, ఎన్‌ఆర్టఇఎస్‌ చైర్మన్‌ వేమూరి రవి పిలుపుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కువైట్‌లోని ఎపి ఎన్‌ఆర్‌టిఎస్‌ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ప్రారంభించారు. దాదాపు 1,50,000 మంద తెలుగుజనాభా ఉన్న కువైట్‌లో నమోదు ప్రారంభించారు. ఎపి ఎన్‌ఆర్‌టిఎస్‌ చీఫ్‌కో-ఆర్డినేటర్‌ బుచ్చి రాంప్రసాద్‌, పెట్టుబడుల విభాగం డైరెక్టర్‌ వేషుబాబు, ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఆయా కార్యక్రమాల్లో ములకాల సుబ్బారాయుడు, బలరాం నాయుడు, వెంకట శివరావు కోడూరి, సాయి సుబ్బారావు, అక్కిలి నాగేంద్రబాబు, దివాకర నాయుడు ఓలేటి, వెంకటేశ్వర్లు యోగి, రమణపేరం, సురేష్‌బాబు మేలపాటి, స్కైనెట్‌ ప్రసాద్‌, ఉద§్‌ు అడుసుమల్లి, బాబు పోలావరపు, మల్లికార్జున మారౌతు, ఎజ్దానీ బాషా తదితరులు పర్యవేక్షించారు.