కూలిన అమెరికా నేవీ విమానం

U.S. Navy plane
U.S. Navy plane

వాషింగ్ట‌న్ః అమెరికాకు చెందిన ఓ నేవీ విమానం కుప్పకూలింది. 11 మంది సిబ్బందితో వెళుతున్న ఈ విమానం జపాన్‌లోని ఒకినావా సమీపంలో పసిఫిక్‌ సముద్రంలో కుప్పకూలిందని అమెరికా నేవీ అధికారులు తెలిపారు. జపాన్‌ కాలమానానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. యూఎస్‌ఎస్‌ రొనాల్డ్‌ రీగాన్‌ సిబ్బంది ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. సిబ్బంది కోసం సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియరాలేదు.