ఆటా-టాటా ఆధ్వ‌ర్యంలో ఇర్వింగ్ క‌న్వెన్ష‌న్ వేడుక‌లు

ATC, ATA , TATA
ATC, ATA , TATA

అమెరికా తెలుగు సంఘం(ఆటా)-తెలంగాణా అమెరికన్‌ తెలుగు సంఘం(టాటా)ల సంయుక్త ఆధ్వర్యంలో ఇర్వింగ్‌ కన్వెన్షన్‌ సెంటరులో అమెరికన్‌ తెలుగు కన్వెన్షన్‌ వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి, అమెరికా నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ఎన్నారైలకు ఆటా-టాటాలు పురస్కారాలను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
వేడుకల్లో ఆటా అధ్యక్షుడు కరుణాకర్‌ అసిరెడ్డి మాట్లాడుతూ, నేడు పలు చోట్ల కొత్త కొత్త తెలుగు సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆటా వంటి ప్రాచీన చరిత్ర ఉన్న సంస్థ టాటా వంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి ఈ వేడుకలను నిర్వహించడం సంతోషంగా ఉందని కరుణాకర్‌ పేర్కొన్నారు.
టాటా అధ్యక్షుడు హరనాథ్‌ పొలిచెర్ల మాట్లాడుతూ, రెండు జాతీయ సంఘాలు కలిసి నిర్వహిస్తున్న ఈ వేడుకలు అందరి మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తుందని చెప్పారు. ఈ వేడుకలకు దాదాపు 2,000 మంది హాజరయ్యారు. మరో రెండురోజులపాటు జరిగే వేడుకల్లో మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.