ఆటా అవార్డుకు ఎంపికైన చారుగుండ్ల రాజ‌శేఖ‌ర్‌

ATA
ATA

అమెరికా తెలుగు అసోసియేషన్‌ అందించే (ఆటా) జాతీయ పురస్కారానికి చారుగుండ్ల రాజశేఖర్‌ ఎంపికయ్యారు. ఆయన కోదాడ మండలంలోని కూచిపూడి తండా ప్రాధమికోన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని ఈ సంస్థ ఈ అవార్డులకు ఎంపిక చేసింది. రాజశేఖర్‌ ఉపాధ్యాయ వృత్తిని అంకిత భావంతో నిర్వహించడంతో పాటు విజయీభవా ట్రస్టును స్థాపించి విద్యార్థులకు మనో వికాస, ప్రేరణ తరగతులు నిర్వహిస్తు అనేక అవార్డులు పొందారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో సహితం ఆయన విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహించారు. దీంతో పాటు పేద విద్యార్థులకు ప్రతిభ గల విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేయడం తో పాటు ప్రభుత్వం చేపట్టే హరిత హారం, స్వచ్ఛభారత్‌ వంటి సేవా కార్యక్రమాల్లో ఆయన భాగస్వాములై గుర్తింపు పొందారు. రాజశేఖర్‌ మండల ఉత్తమ ఉపాధ్యాయునిగా, మధర్‌ థెరిస్సా సేవా అవార్డు, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక అవార్డులను పొందారు. అక్టోబర్‌ 8న భద్రచలం లో జరిగే అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన ఈ జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు. తాళ్ళురి పంచాక్షరయ్యా ఛారిటబుల్‌ ట్రస్టు, తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా, తెలుగు భాషా సాంస్కృతిక శాఖ సమక్షంలో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగనున్నట్లు సంస్థ జాతీయ అధ్యక్షుడు బెక్కంటి శ్రీనివాస్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు హాజరౌతున్నట్లు తెలిపారు. కాగా రాజశేఖర్‌ ఈ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు, కళాశాలల యాజమాన్యాలు, ఆవోపా, విజయీభావ ట్రస్టు, పలు స్వచ్ఛంద సంస్థల బాధ్యులూ, బందువులు, మిత్రలు హర్షం వ్యక్తం చేసారు.