అట్లాంటాలో శిక్షణా తరగతులు

CPR Training Classes
CPR , TANA Conducted Training Classes in Atlanta

అట్లాంటాలో శిక్షణా తరగతులు

అట్లాంటా: ఇక్కడి శ్రీకృష్ణవిలాస్‌ అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వరంయలో సిపిఆర్‌ తరగతులు నిర్వహించారు. హృద్రోగ వ్యాధులతో బాధపడేవారికి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎలా సాయం చేయాలి అనే అంశంపై జరిగిన శిక్షణా తరగతుల్లో సుమారు 50కిపైగా ప్రవాసులు పాల్గొన్నారు. తామా బోర్డు డైరెక్టర్‌ ముద్ధాళి సుబ్బారావు, తానా దక్షిణతూర్పు సమన్వయకర్త అనిల్‌ యలమంచలి, ‘తానా కేర్స్‌ కార్యక్రమాలను వివరించారు. అమెరికాలోని తెలుగువారి అవసరాలను తీర్చటమే తానా కేర్స్‌ ఉద్దేశ్యమని , ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, సేవ తదితరల విభాగాల్లో శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమానికి సదుపాయలు సమకూర్చిన వెన్సా§్‌ు ఫౌండేషన్‌ అధినేత నిమ్మగడ్డ శ్రీనివాస్‌ను తానా కేర్స్‌ ఘనంగా సత్కరించింది.. ట్రస్టు హోంకేర్‌ అధినేత రహీమ్‌ హుస్సేన్‌ మాట్లాడారు. సభ్యులు ఉపేంద్ర నర్రా, తామా అధ్యక్షులు వెంకట్‌, తామా బోర్డు కార్యదర్శి మహేష్‌ పవార్‌ తదితరులు పాల్గొన్నారు.