అటా ఆధ్వర్యంలో ఘన సన్మానం

ATA
ATA

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం అట్లాంటాలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో టీసీసీఐ రాష్ట్ర సెక్రటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ జగదీశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటా వీరిద్దరని ఘనంగా సత్కారించింది. ఈ కార్యక్రమంలో అటా ప్రెసిడెంట్‌ కరుణాకర అసిరెడ్డి, అటా బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ అనిల్‌ బొడ్డి రెడ్డి, రీజినల్‌ కో ఆర్డినేటర్‌ శివ కుమార్‌ రమదుగు, వీరితో పాటు గేట్స్‌ ప్రెసిడెంట్‌ నందా చాట్లా, గటా చీఫ్‌ శంకర్‌ గండ్ర, రఘు మరిపెడ్డి, గేట్స్‌ చైర్మన్‌ శ్రీధర్‌ నరవెల్‌, వెంకట్‌ వీరనేనిలు పాల్గొన్నారు. అంతేకాక ఈ సమావేశానికి స్థానిక కమ్యూనిటీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.