మా విశ్వాసంతో వ్యాపారం చేయాలనుకుంటున్నారు: హర్‌సిమ్రత్‌ కౌర్‌

HARSIMRAT KOUR
HARSIMRAT KOUR

న్యూఢిల్లీ: సిక్కు మత స్థాపకుడు గురునానక్‌ సాహెబ్‌ తన జీవితంలోని చివరి 18 ఏళ్ల కాలాన్ని కర్తార్‌పూర్‌ సాహెబ్‌ గురుద్వారాలో గడిపారు. 1539లో ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఈ గురుద్వార పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో గల కర్తాపూర్‌ గ్రామంలో ఉంది. అయితే పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌ సాహెబ్‌ గురుద్వారా ప్రవేశానికి ఒక్కో భక్గుడు 20 యూఎస్‌ డాలర్లు చెల్లించాలని పాకిస్థాన్‌ చెప్పడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ విమర్శించారు. మత విశ్వాసంపై పాక్‌ వ్యాపారం చేయడం సిగ్గచేటని మండిపడ్డారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్‌ కారిడార్‌ను నవంబర్‌ 9న ప్రారంభించనున్నట్లు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పారు.ఈ క్రమంలో భారత్‌లోని సిక్కు యాత్రికులు వీసా లేకుండా పవిత్ర కర్తార్‌పూర్‌ సాహిబ్‌ వెళ్లే అవకాశం లభించింది. అయితే గురుద్వారా ప్రవేశానికి 20 డాలర్లు వసూలు చేయడం దారుణమని మంత్రి విమర్శించారు. ఈ విషయంపై హర్‌సిమ్రత్‌ కౌర్‌ మండిపడుతూ కర్తార్‌పూర్‌ సాహిబ్‌ సందర్శనకు వచ్చే భక్తుల నుంచి 20 డాలర్లు వసూలు చేస్తామంటున్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/andhra-pradesh/