ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు!

CM Yogi Adityanath
CM Yogi Adityanath

లక్నో: ఉత్తరప్రదేశ్‌ లో 2017 మార్చిలో ఏర్పడిన రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పటి వరకు విస్తరణ చేపట్టలేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేయడంతో పాటు పనితీరు సరిగాలేవని వారికి ఉద్వాసన పలికి ఆశావహులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సిఎం యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వంలో మొత్తం 46 మందికి మంత్రి వర్గంలో అవకాశం ఉంది. అందులో ఇప్పటికే 14 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో నలుగురు మంత్రులు ఎంపీలుగా పోటీ చేశారు. ఒకవేళ ఆ నలుగురు పార్లమెంట్‌కు ఎంపికైతే మరో నాలుగు స్థానాలు ఖాళీ అవుతాయి. దీంతో మంత్రి పదవుల ఖాళీల సంఖ్య మొత్తం 18కి చేరుకుంటుంది.


మరిన్ని క్రీడ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/