గవర్నర్‌ను కలిసిన యడ్యూరప్ప

Yeddyurappa, Other BJP Leaders
Yeddyurappa, Other BJP Leaders

బెంగళూరు: బిజెపి చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్ప గవర్నర్‌ వాజూభాయ్ వాలాను కలుసుకున్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలు సక్రమంగానే ఉన్నప్పటికీ వాటిని స్పీకర్ ఆమోదించడం లేదని గవర్నర్‌కు యడ్యూరప్ప ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడతు ఎమ్మెల్యేల స్వచ్ఛంద రాజీనామాపై తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలని గవర్నర్‌ను తాను కోరినట్టు యడ్యూరప్ప తెలిపారు. ఎమ్మెల్యేల రాజీనామాలతో సంఖ్యాబలం కోల్పోయిన ముఖ్యమంత్రి కుమారస్వామికి పదవిలో కొనసాగే అవకాశం లేదని యడ్యూరప్ప అన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/