ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది

yamuna river
yamuna river

న్యూఢిల్లీ: యమునా నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. హరియానాలోని కుంద్ ప్రాజెక్టు నుంచి నాలుగు లక్షల 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో యమునా నదిలో వరద పరిస్థితి నెలకొంది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. వారికి ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ప్రతి ఏడాది ఇలాంటి పరిస్థితే ఎదురవుతోందని, అయితే ఇంతటి వరద నీటిని ఎప్పుడూ చూడలేదని స్థానిక ప్రజలు అంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అధికారులను అడిగి వరద పరిస్థితి తెలుసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/