లోక్‌సభలో ఆజమ్‌ఖాన్‌పై మహిళా ఎంపిల ఆగ్రహం

ఆజమ్‌ఖాన్‌ క్షమాపణ చెప్పాలి

Smriti Irani
Smriti Irani

న్యూఢిల్లీ: లోక్‌సభలో ఈరోజు బిజెపి మహిళా ఎంపీ రమాదేవిపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజమ్‌ఖాన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై మహిళా ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లోక్‌సభ దద్దరిల్లింది. ఆజమ్‌ఖాన్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని లేదంటే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సభ్యులతో పాటు బిజెపి ఎంపీలు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు. మహిళను అగౌరవపర్చకూడదు. దీనిపై గళమెత్తాల్సిన సమయం వచ్చింది. దీన్ని మనం చూస్తూ ఊరుకోకూడదు. అభ్యంతరకరంగా మాట్లాడి వెళ్లిపోవడం సరికాదు. ఇదే వ్యాఖ్యలు బయట చేస్తే పోలీసులు అరెస్టు చేసేవారు అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/