మహిళా పారిశ్రామికవేత్త ఆత్మహత్య

suicide
suicide


చెన్నై: కంపెనీలో పనిచేస్తున్న ఒక వ్యక్తి విషయంలో భర్తతో గొడవపడిన మహిళా పారిశ్రామికవేత్త ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఒకటి చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నై కొఠారి రోడ్డులో ఉంటున్న 49 యేళ్ల రీతా లంకలింగమ్‌ ల్యాన్సన్‌ టయోటాలో జాయింట్‌ డైరెక్టర్‌. ఆమె భర్త లింకలింగమ్‌ మురుగేష్‌ ల్యాన్సర్‌ టయోటా కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌. అదే కంపెనీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని మందలించే విషయంలో రీతా లంకలింగమ్‌ ఆమె భర్త లంకలింగమ్‌తో గొడవపడింది. వారి గొడవ తారస్థాయికి చేరింది. భర్త లంకలింగమ్‌ మురుగేష్‌ గొడవ తరువాత ఇంటి వెళ్లకుండా హోటల్లో ఉన్నాడు. రీతా లంకలింగం కనిపించకపోవడంతో సూపర్‌వైజర్‌ వెళ్లి చూడతా రీతా లంకలింగమ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ శవమై కనిపించింది. విషయం తెలుసుకున్న లంకలింగమ్‌ మురుగేష్‌ పోలీసులకు సమాచారమిచ్చాడు. కుటుంబ సమస్యలతోనే రీతా లంకలింగం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రీతా లంకలింగమ్‌ ఆత్మహత్య చేసుకునే ముందు ఎలాంటి సూసైడ్‌ నోట్‌ రాయలేదు. తమిళనాడులోని తుత్తుకుడికి చెందిన రీలా లంకలింగమ్‌ భర్త లంకలింగమ్‌ మురుగేష్‌తో కలిసి చెన్నైలో నివాసం ఉంటున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/