వింగ్‌ కమాండర్‌ పాక్‌ విమానాన్ని కూల్చారు

  • పాకిస్థాన్‌ ఎఫ్‌-16ని కూల్చివేయడం స్క్రీన్‌పై గమనించాను
Abhinandan-Varthaman-Minty Agarwal
Abhinandan-Varthaman-Minty Agarwal

న్యూఢిల్లీ: వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వీరోచిత పోరాటం, పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌16 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఘటన తాను కళ్లారా చూశానని స్క్వాడ్రన్‌ లీడర్‌ మింటీ అగర్వాల్‌ తెలిపారు. ఆ సమయంలో నేను అభినందన్‌కు వాతావరణ పరిస్థితులు తెలియజేస్తూ స్క్రీన్‌పై ఆయన సాహసాన్ని గమనిస్తున్నానని తెలిపారు. యుద్ధ సమయంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ప్రభుత్వం ఇచ్చే ఖయుద్ధ సేవా పతకంగ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా మింటీ అందుకుంది. ఈ పురస్కారం అందుకున్న తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందింది.

ఈ సందర్భంగా మింటీ మాట్లాడుతూ ఖఫిబ్రవరి 27న బాలాకోట్‌ స్థావరాలపై భారత్‌ యుద్ధ విమానాలు విజయవంతంగా దాడులు నిర్వహిస్తున్నాయి. పాకిస్థాన్‌ నుంచి గట్టి ప్రతిస్పందన ఎదురవుతుందని భావించి అందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం. ఊహించినట్టే మనల్ని దెబ్బకొట్టేందుకు పాకిస్థాన్‌ ఎఫ్‌16 మన గగనతలంలోకి ప్రవేశించింది. అప్పటికే మన పైలెట్లు, కంట్రోలర్లు, ఇతర బృందం అప్రమత్తంగా ఉండడంతో వారి వ్యూహం ఫలించ లేదు. అదే సమయంలో అభినందన్‌ వర్థమాన్‌ ఎఫ్‌-16ని గురిపెట్టి కూల్చివేశాడు’ అని మింటీ తెలిపారు.
ఈ సందర్భంగా మన మిగ్‌ కూడా కూలిపోవడం, పారాచ్యూట్‌ సాయంతో పాకిస్థాన్‌ భూభాగంలో దిగిన అభినందన్‌ను స్థానికులు పట్టుకుని పాకిస్థాన్‌ సైనికులకు అప్పగించడం తెలిసిందే. 


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/