పౌరసత్వ చట్ట సవరణపై బిజెపి నేత నిరసన

Chandra Kumar Bose
Chandra Kumar Bose

కోల్‌కతా: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మనవడు, పశ్చిమ బెంగాల్‌ బిజెపి ఉపాధ్యక్షుడు చంద్రకుమార్‌ బోస్‌ పౌరసత్వ చట్టం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశంలో అన్ని మతాల వారు స్వేచ్ఛగా జీవించవచ్చని ఆయన వ్యాఖ్యనించారు. సీఏఏ బిల్లుకు మద్దతుగా బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి నడ్డా కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించిన కొద్దిగంటల్లోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సీఏఏ ఏ మాతానికి సంబంధించింది కాకపోయినట్లైతే హిందూ, సిక్కు, బౌద్ధ, క్రైస్తవ, పార్శీలు, జైనులు అని ఎందుకు పేర్కొన్నారు. ముస్లింలను ఎందుకు సీఏఏ బిల్లులో చేర్చలేదని చంద్రకుమార్‌ బోస్‌ బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మనం పారదర్శకంగా ఉందామని ప్రభుత్వానికి తెలిపారు. భారత్‌ను ఇతరదేశాలతో పొల్చవద్దని చెప్పారు. భారతదేశం అన్ని మతాలను, అన్ని వర్గాలను స్వాగతిస్తుందని అన్నారు. ఒక వేళ మాతృదేశంలో వారిని హింసించకపోతే ముస్లింలు ఇక్కడకు వచ్చేవారే కాదన్నారు. కాబట్టి వారిని కూడా కలుపుకోవడంలో ఎలాంటి ముప్పు లేదని అన్నారు. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బలోచ్‌ ప్రజలు, పాకిస్థాన్‌లోని అహ్మదీయుల పరిస్థితి ఎంటని ఆయన ట్విట్టర్‌ వేదికగా బోస్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/