మీరు ఈ పిటిషన్ ను ఎందుకు వేశారో తెలియడం లేదు

అరగంట చదివినా అర్థం కాలేదు

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ రాష్ట్ర పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను ఈ ఉదయం విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖినేను మీ పిటిషన్ ను అరగంటపాటు చదివాను. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మీరు ఈ పిటిషన్ ను ఎందుకు వేశారో తెలియడం లేదుఖి అని వ్యాఖ్యానించారు. కాగా, సీనియర్ న్యాయవాది ఎంఎల్ శర్మ, ఈ పిటిషన్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా, అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని రెండుగా విభజించారని, ఆర్టికల్ 370 రద్దుపై స్టే ఇవ్వాలని ఆయన కోరిన సంగతి తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/